Skip to main content

నేను, దేవుడు, మా నాన్న - 1

ఆ రోజు స్కూల్లో ఘోర పరాభవం జరిగింది.అసలు రోజూ స్కూల్ కి ఎందుకు వెళ్ళాలో అర్ధం గాక ఏడుస్తూ వెళ్తుంటే ఈ అవమానాలోటీ - బాలయ్య సినిమానే చూడలేక చూస్తుంటే, మధ్యలో విజయ్ కాంత్ డబ్బింగ్ సినిమా ట్రైలర్ వేసినట్టు !

సరే, అసలేం జరిగిందో చెబుతాను. ఆ రొజు పొద్దుటే స్కూల్లో ప్రెయెర్ జరుగుతోంది. రెండో క్లాసు వాళ్ళం కావడంతో తగిన గౌరవం ఇచ్చి ముందు నించోబెట్టారు. ఎదురుగా మా హెడ్మాష్టరు నించున్నాడు. వాడి పేరు వలవన్. పెద్ద పెద్ద మీసాలేసుకుని ఒక లోటాడు టీ తాగుతూ తిరిగే వాడంటే మాకు హడల్. మా టీచరుకి అంతకంటే హడల్ అని నా నమ్మకం. ఎందుకంటే క్లాసు రూము పక్క నించి వాడు వెళ్ళినప్పుడల్లా మా అందరికంటే ముందు మా టీచరు నోటి మీద వేలేసుకునేది. అది చూసి మేము కూడా వేసుకునేవాళ్ళం. అసలు వాడి లాంటి వాళ్ళని స్కూల్లో ఉంటే వలవన్ అంటారనీ, బైటకొచ్చి దేశం మీద పడితే వీరప్పన్ అంటారనీ తరవాత తరవాత, కొంచెం లోక ఙానం ఒచ్చాక తెలిసింది.

ఇదివరకెపుడో కుదురు లేని దూడ పిల్ల పులి ముందుకెళ్ళి డాన్స్ చేసిందిట!
నా వెనక నించున్న నాగబాబు గాడికి ఉన్నట్టుండి ఎక్కడలేని చిలిపితనం ముంచుకొచ్చి నిక్కర్లో నీట్ గా టక్ చేసి ఉన్న నా చొక్కాని సాంతం బైటకి లాగాడు, మా వీరప్పన్ గాడు ఉన్నాడని మర్చిపోయి. దెబ్బకి దెబ్బ తియ్యడంలో బెబ్బులి లాంటి నేను, సెకను కూడా ఆగకుండా వెనక్కి తిరిగి వాడికీ అదే సన్మానం చేసాను. వాడి నిక్కరు కూడా పూర్తిగా కిందకు లాగేసే ప్రయత్నంలో ఉండగా మా వీరప్పన్ గాడు చూసి, కోళ్ళని పట్టుకున్నట్టు ఇద్దరి మెడకాయల్నీ పట్టుకుని సాదరంగా వేదిక మీదకి తీసుకెళ్ళాడు.
ఆ తర్వాత రెండు తలకాయిలూ ఒక దానికోటేసి గుద్దాడు. ఆ దెబ్బకి చుట్టూ ప్రపంచం ఒక ఐదు నిమిషాల పాటు గింగిరాలు తిరిగింది. ఈ కొత్త ఫీలింగుని చూసి నాగబాబుగాడు నెప్పి మర్చిపోయి నవ్వడం మొదలెట్టాడు. నేను తలకాయ పట్టుకుని క్లాసులోకెళిపోయాను.

ఈ దురవస్థకి కారణమేంటా అని అలోచిస్తూ నిక్కరు జేబుల్లో చేతులు పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్న నాకు అద్భుతమైన ఐడియా ఒచ్చింది. నెక్స్ట్ సీన్లో Root Cause Analysis చేసి గ్రాఫు మిద చుక్కలన్నీ కలపగానే నవ్వుతున్న నాగబాబుగాడి మొహం ఒచ్చింది. ఈసారి వాడికి బుధ్ధి చెప్పాల్సిందే అనుకుని ఆ పేపర్ దిండు కింద పెట్టుకుని నిద్ర పోయాను.

ఆ మరుసటి రోజు ఊరి నించి మా బామ్మ ఒచ్చింది. ఆవిడ తెచ్చినవన్నీ తినడం అయిపోయాక మాట్లాడదామని దగ్గరకెళ్ళాను.
"ఏరా భడవా....గుడికెళ్దాం వస్తావా" అడిగింది.
రానని నోటి చివరి వరకూ ఒచ్చినా, గుళ్ళో పులిహోర వాసన గుర్తొచ్చి ఆగిపోయాను.

మేము గుళ్ళోకెళ్ళి దణ్ణం పెట్టుకునాక, పులిహోర ఒక కాయితంలో పోసుకుని మెట్ల మీద కుర్చున్నాను. అక్కడ మైకు ముందు ఒక గడ్డం స్వామిగారు కుర్చుని మాట్లాడుతున్నారు. మా బామ్మ శ్రద్ధగా వింటోంది. నేను అంతకంటే శ్రద్ధగా పులిహోర తింటున్నాను.

"మానవ జన్మ అత్యుత్తమమైనది. మానవుడు కర్మ బధ్ధుడు. ఎల్లప్పుడూ సత్కర్మలనే చేసి, హృదయాన్ని దేవాలయంలా పవిత్రంగా ఉంచుకోవాలి" అని ఇంకా చెప్తూ ఉన్నారు గడ్డం స్వామి. అప్పుడే పులిహోర అయిపోవడంతో వినడం మొదలెట్టాను.

"ప్రతి మనిషిలోను భగవంతుడు కొలువై ఉంటాడు. అందుకే అన్నారు "అహం బ్రహ్మస్మి" అని !
కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఇది తెలుసుకోగలరు. ఎందుకంటే మాయాంధకారం కళ్ళు కప్పేస్తుంది. జప ధ్యానాది క్రియలతో సాధన చేసి అంధకారాన్ని పారద్రోలాలి" ఇలా చెప్పుకుంటూ పొతున్నారు గడ్డం స్వామి.
ఆయిన మాట్లాడిన దాంట్లో నాకు అర్ధమైనదీ,గుర్తున్నదీ రెండే ముక్కలు .

1.అందరు మనుషుల్లో భగమంతుడు అనే ఆయిన ఉంటాడు - ఈ సంగతి కొందరికే తెలుసు.(అర్ధమైనది)
2."అహం బ్రహ్మస్మి" (గుర్తున్నది)

ఇంటికి వెళ్ళే దారిలో మా బామ్మని అడిగాను.
"బామ్మా, భగమంతుడు అంటే ఎవరు ?"
"భగమంతుడు కాదు, భగవంతుడు. అంటే దేవుడు రా" అంది బామ్మ.
అంతే - విషయం పూర్తిగా అర్ధం అయ్యింది. ఒక పక్క నించి భలే సంబరమేసింది !

నేను తెలుసుకున్న దాన్ని సూక్ష్మంలో మోక్షం అంటారనీ, నన్ను ఏక సంథాగ్రాహి అంటారనీ, పెద్దయ్యాక తెలిసింది.

మరుసటి రోజు సాయంత్రం నాగబాబుగాడు ఆడుకుందామని మా ఇంటికొచ్చాడు. ఆట తర్వాతని చెప్పి, అక్కడున్న దేవుడి పటం చూపించి "అదెవరో తెలుసా ?" అని అడిగాను.
"దేవుడు" అన్నాడు వాడు.
"కాదు నేనే" అన్నాను, నిజం నాకు మాత్రమే తెలుసు అని మురిసిపోతూ.
"నువ్వు దేవుడేంటీ ?" అడిగాడు వాడు.

"ఉండు ఇప్పుడే చూపిస్తా" అని బాసింపట్టు వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుని అప్పటి వరకూ సంపాదించిన సినిమా పరిఙానమంతా ఉపయోగించి.."అహం బ్రహ్మస్మి" అని NTR లెవెల్లో మూడు సార్లు గర్జించాను.
ఆ తరవాత మా ఇంట్లో సూర్య నమస్కారాల పుస్తకం లో ఉన్న బొమ్మల్లో ఒంటి కాలి మీద నమస్కారం పెట్టే భంగిమలో నించుని మళ్ళీ మూడు సార్లు "అహం బ్రహ్మస్మి" అని గర్జించాను.

ఆ దెబ్బకి నాగబాబుగాడు నేను దేవుణ్ణి కాకపోయినా మినిమం సినిమాల్లో చూపించే మాంత్రికులకి మినీ వెర్షన్ననుకుని,వాణ్ణి మాయం చేసేస్తానేమోనని భయపడి ఇంటికి పరిగెత్తాడు. నేను విజయగర్వంతో నిద్ర పోయాను.

(ఇంకా ఉంది)

Comments

rays said…
excellent narration..chaalaa bagundi...hilarious..
Sravya V said…
భలే ఉందండి ! ఇంతకీ వలవన్ ఏమిటి తమిళ పదమా ?
వేమన said…
rays, venuram, chaitanya - Thanks !

శ్రావ్య - అది తమిళ పెరేనండీ :)
:))
Root cause analysis అయిడియా సూపర్బ్..
బాగుంది...బాగుంది..మరి తర్వాత..
బాబాయ్ నిజం చెప్పు నీ బ్లాగులకి comments రాయడానికి మనుషులని పురమాయించుకున్నవు కదా?
వేమన said…
@ islandofthoughts -
కైసీ బాతా కర్రాయ్ మియా..క్యా సోచ్తే లోగ్ ?

ఆ పన్లోనే ఉన్నా :)
మంచు said…
ఎమీ రాసారండి.. super..మొదటి పెరాగ్రాఫే అదిరిపొయింది.. త్వరగా రెండొ పార్ట్ రాసేయండి ...
బాగుందండి.
రూట్ కాజ్ అనాలిసిస్ మీకు అప్పుడే వచ్చన్నమాట. ఏమిటో వెధవది కాటికి కాలు చాచుకున్నా [ఉద్యోగ జీవిత కాలం వరకు ;) ] నాకింకా రాదు. అందరి తప్పులు మన్నించి ఫిక్స్ చేసేయటం తప్పా!!!!
Unknown said…
నెక్స్ట్ సీన్లో Root Cause Analysis చేసి గ్రాఫు మిద చుక్కలన్నీ కలపగానే ..

so meru tivoli or HP brand ayi undali !!!!
anni postlu chadivesanu, raccho raccha, keep rocking

Popular posts from this blog

నేను, దేవుడు, మా నాన్న - 2

మర్నాడు ఆదివారం కావడంతో మా పిల్లకాయల పార్టీ సర్వ సభ్య సమవేశం మొదలైంది. పక్కింట్లో ఉండే బుజ్జి గాడూ, వాళ్ళ తమ్ముడు పండు గాడు, వాళ్ళ పక్కింట్లో ఉండే శీనుగాడూ, వాళ్ళ చెల్లి కవిత హాజరయ్యారు. అధ్యక్షత వహిస్తున్న మా చెల్లి డయిలాగులేవీ లేకుండా "ఓ పియా పియా.. ఓ పియా పియా " అంటూ ఇళయరాజా పాటని ప్రళయ రాగంలో విలయ తాండవం చేయించింది. అయిదు నిమిషాలయినా పాట ముందుకి కదలకపోవడంతో అందరూ వెళ్ళిపోక ముందే దాన్ని కూర్చోబెట్టి నేను మొదలెట్టాను. "జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట.. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకూ కన్నీళ్ళూ అనాథలైనా అభాగ్యులైనా అంతా నా వాళ్ళూ ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరూ" అంటూ వేలు చూపిస్తూ గుండ్రంగా తిరుగుతూ...ఆపేసాను - వీధి చివర చారిగాడు కనిపించాడు. మామూలుగా పరిగెట్టడం మానేసి గుర్రం ఎక్కి ఒస్తున్నట్టు గెంతుకుంటూ ఒస్తున్నాడు వాడు. ఒస్తూనే పక్కకి లాక్కెళ్ళి, "ఒరేయ్, మా నాన్న జేబులో యాభై రూపాయిలు దొరికాయి రా, మనం ఫైవ్ స్టార్ చాక్కెట్ట్లు కొనుక్కుందాం పద" అన్నాడు. అసలు వీడు గుండెలు తీసిన బంటు కాకపోయినా కనీసం గుండు చేసి ఒదిలిపెట్టే బంటు అని అప్పటికే నాకు అను

బోయినం

ఆ రోజు అప్రయత్నంగా వంట డ్యూటీ నాగబాబుకి ఇచ్చేసి డిక్షనరీ పక్కన పెట్టుకుని హిందూ పేపర్ చదువుకుంటున్నాను. "ఒరేయ్, పప్పులో ఉప్పెంత వెయ్యాలి ?" అడిగాడు నాగబాబు. "ఒక చారెడు వెయ్ " తల తిప్పకుండా సమధానం చెప్పా. "మరి చారేమో గిన్నెడు ఉంది కదరా ?" ఈ సారి తలెత్తి చూడకుండా ఉండలేకపోయాను. వంటింటి గుమ్మంలో బనీనుతో కుడి చేతిలో గరిట పట్టుకుని ఎడం చెయ్యి నడుం మీద వేసుకుని చిరునవ్వులు చిందిస్తున్నాడు వాడు. "ఒరేయ్ బడుద్ధాయ్, నీకు తెలుగొచ్చా అసలు ?" అరిచాను. " ఓహో అర్ధం అయింది లే, అరుస్తావెందుకు ? చారిగాడు పెరుగు తెస్తానని బైటకి వెళ్ళాడు ఇప్పుడే. వాడొచ్చే దాకా ఆగాలంటే కష్టం" అన్నాడు నాగబాబు. ఈ రోజు హిందూ పేపరు అనవసరంగా కొన్నట్టున్నాను. "ఒరేయ్ సన్నాసీ, చారెడు అంటే ఇంత" అన్నాను అరచేతిలో నాలుగువేళ్ళ మీద బొటనవేలు మడిచి చూపిస్తూ, "అయినా నీకు తెలుగూ రాదు, వంటా రాదు; ఇలా ఐతే ఎదో ఒక టీవీ ఛానల్లో వంటల ప్రోగ్రాంలో యాంకర్ కింద సెటిల్ అవ్వాల్సొస్తుంది జాగ్రత్త !" శపించా. వాడు పగలబడి నవ్వి లోపలికెళిపోయాడు, పొగిడాననుకున్నాడో ఏమో! అ