ఆ రోజు పొద్దుటే చిన్న తలనెప్పితో నిద్ర లేచాను. ఆఫీసు గుర్తు రాగానే పరిస్థితి చెయ్యి దాటి పోయింది. ఛీ, ఇంతేనా జీవితం అనిపించింది. పోనీ ఎగ్గొట్టేద్దామా, మా బాసుగాడి ఫ్రెంచి గడ్డం సాక్షిగా క్రితం రోజు మీటింగు రూములో ఎక్సెల్ షీట్లు మార్చుకుని చేసుకున్న బాసలు గుర్తొచ్చాయి. చేసుకున్నవాడికి చేసుకున్నంత అని ఇందుకే అన్నారు కాబోలు. నేను గానీ కనిపించకపోతే ఆ విరహ వేదనలో వాడో సైకో కిల్లర్ అయ్యి మా ఇల్లు వెతుక్కుంటూ ఒస్తాడేమో అని భయమేసి తయారవడం మొదలెట్టాను. ఇంకేమైనా మార్గాలు దొరుకుతాయేమో అని అలొచించినా ఏమీ తట్టకపోవడంతో సౌరవ్ గంగూలీ బాటింగుకి బయలుదేరినట్టు ఆఫీసుకి బయలుదేరాను.
బస్సెక్కి కూచోగానే ఇంటికి ఫోన్ చేసాను. మా అమ్మ ఎత్తింది.
బావున్నావా, బాగా తింటున్నావా, రోజు స్నానం చేస్తున్నావా, పప్పులో పోపెయ్యడం ఇప్పటికయినా ఒచ్చిందా లాంటి కబుర్లన్నీ అయిపోయాక,
"అమ్మా, ఏంటో బొత్తిగా ఇంటరెస్టు ఉండట్లేదే దేని మీదా, అసలు మనసు మనసులో లేదు" అన్నాను.
"తొందరగా పెళ్ళి చేసుకోరా, లేకపోతే ఆ అమ్మాయెవరో చెప్పు , మీ నాన్నా నేనూ వెళ్ళి వాళ్ళ పెద్ద వాళ్ళతో మాట్లాడతాం".
"నాకే టయిములేక ఏడుస్తుంటే నువ్వేంటి అమ్మాయీ, పెళ్ళి అంటావు. ఇలా కాదు, నేను రాత్రికి ఫోన్ చేసి వివరంగా మాట్లాడతాలే" అని కట్ చెయ్యబోతుంటే అవతల్నించి మా చెల్లి గొంతు వినబడింది.
"ఒరేయ్ అన్నయ్యా, వంట మానేసి హోటల్లో తింటున్నావా ?" అడిగింది.
"అవునే, నీకెలా తెలుసు ?" ఆశ్చర్యంగా అడిగాను.
"నీ బధ్ధకం సంగతి నాకు తెలీదా, ఆ హోటలు తిళ్ళు తింటే అలా వైరాగ్యమే ఒస్తుందిగానీ, ఈ వీకెండు ఇంటికొచ్చెయ్, వెజిటబుల్ బిర్యాని కొత్త పద్ధతి లో చెయ్యడం నేర్చుకున్నాను."
నాకు కాళ్ళూ చేతులూ వణకడం మొదలెట్టాయి. పోయిన సారి ఇదే, వాళ్ళ ఫ్రెండుకి తినిపిస్తే, దెబ్బకి ఆ పిల్ల దుబాయి పారిపోయింది.
"వీకెండెందుకూ, ఒక రెండు వారాలు సెలవు పెట్టుకొస్తాలే"
"సరే కానీ ఎదో ఒకటి, డాడీ మాట్లాడతారుట ఇదిగో" అంది.
"ఏరా డబ్బారేకుల సుబ్బారావ్, ఏంటి ఏవో పైత్యపు మాటలు మాటాడుతున్నావుట మీ అమ్మతో ? నీకు అప్పుడే చెప్పాను చదువుకునేప్పుడే సరిగ్గా చదువుకోరా అని. ఇలా సగం చదువులు చదివి ఉద్యోగాలు వెలగబెడితే అలాంటి తిక్క ఆలోచనలే ఒస్తాయ్. నోరు మూసుకుని మీ కంపెనీ వాడు ఏది చెప్తే అది చెయ్" అన్నాడు మా నాన్న.
"సరే నాన్నా, మా ఆఫీసు ఒచ్చేసింది, మళ్ళి ఫోన్ చేస్తానని అమ్మతో చెప్పు" అని ఫోన్ కట్ చేసి మిగితా నలభై నిమిషాలూ బస్సు కిటికీలోంచి చూస్తూ ప్రశాంతంగా గడిపేసాను.
ఆఫీసులో అడుగు పెడుతూనే మా బాసుగాడు రోటీనుకి భిన్నంగా మీటింగు రూముకి బదులు కాంటీనుకి తీసుకెళ్ళి కాఫీ తాగుతూ క్లాసు మొదలెట్టాడు.
"చూడు భాస్కర్, మనం చిన్న పని చేసినా పదిమందీ చెప్పుకోవలయ్యా. నిన్ను చూస్తే జాలేస్తోంది. చాకిరీ చేస్తావు, ఎవడికీ తెలీదు.. ఇలా అయితే కష్టం" అన్నాడు.
"అవును సార్, నాకూ అదే అనిపించింది. ఇంతోటి దానికి ఈ ఉద్యోగం చేస్తే ఎంత చెయ్యకపోతే ఎంత అని కూడా అనిపించింది" అని నానాపటేకర్ లా నిజం మాటాడాను.
"ఓహో అలాగా, నువ్వు ఇప్పుడు చెప్పిన మాటలే ఇంగ్లీషులో రాసి పంపించు. వెంటనే యాక్సెప్ట్ చేస్తాను" అన్నాడు.
వాడు నా రాజీనామా గురించి మాట్లాడుతున్నాడని అర్ధమయ్యి,
"సార్, అంత సాయం అక్కర్లేదు. ఒక్క రెండు రోజులు లీవు ఇప్పించండి చాలు. రోజూ మీ పేరు చెప్పి డబ్బులిచ్చి షేవింగు చేయించుకుంటాను" అని కళ్ళనీళ్ళతో బతిమాలాను.
వాడు సరే అనడం ఆలస్యం, వెనక్కి తిరిగి చూడకుండా బయిటకొచ్చేసాను.
ఇంటికి రాగానే ఎం చెయ్యాలో తోచక నాగబాబుగాడికి ఫోన్ చేసాను.
నా బాధ వాడికి చెప్పగానే, "నాకు కూడా సరిగ్గా ఇదే ఫీలింగురా" అన్నాడు. వాడి గొంతులో ఎక్కడలేని ఆనందం !
"మనం అర్జెంటుగా కలుద్దాం. నేను ఇప్పుడే ఒచ్చేస్తున్నా" అని ఫోన్ పెట్టేసాడు.
నాగబాబుగాడు ఒస్తూనే "ఒరేయ్, బాగా ఆకలేస్తోందిగానీ, ఏమైనా తిందాం పద" అని రోడ్డు పక్కన ఉన్న దోశ బండి దగ్గరకి తీసుకెళ్ళాడు.
"ఓరేయ్, నీకూ నాకూ అంటే ఇది అలవాటుగానీ, ఇలా రోడ్డు మీద తిళ్ళు తింటే మీ ఆఫీసు వాళ్ళు ఏమీ అనుకోలేదా ఇప్పటి వరకూ ?" అడిగాను.
దానికి వాడు, "నేనొకటి అడుగుతాను చెప్పు, ఇప్పటికిప్పుడు మనని ఎవరైనా కుక్కల కింద మార్చేశారనుకో, నువ్వు ఎమవుతావు - పెంపుడు కుక్కా, వీధి కుక్కా ?" అడిగాడు.
"పెంపుడు కుక్క, రోజు కనీసం తిండి అయినా దొరుకుతుంది" అన్నాను.
"పిచ్చి వాడా, వీధి కుక్కకున్న స్వాతంత్ర్యం విలువ తెలీదు నీకు !"
వాడి లాజిక్ అర్ధం కాకపోయినా, ఆవేదన అర్ధమయ్యి తలూపాను.
"చెప్పరా, ఈ నిరుత్సాహం నించి బయిటపడాలంటే ఏం చేద్దాం?" అడిగాను.
"నువ్వు చిన్నప్పుడు పెద్దయ్యాక ఏమవుదాం అనుకున్నావ్ ?"
"దళపతి సినిమా చూసిన దగ్గరనించీ అరవిందస్వామిలా కలెక్టర్ అవుదాం అనుకున్నా" అన్నాను.
వాడు తల బాదుకుని, "ఎవడన్నా ఆ సినిమా చూసి రజనీకాంత్ లా హీరో అవుదాం అనుకుంటాడు, సరేలే ఎదో ఒకటి ఏడిచావ్, నేనేమవుదాం అనుకున్నానో తెలుసా ?" అన్నాడు వాడు.
ఏంటన్నట్టు చూసాను.
"పెద్దయ్యాక పోలిసన్నా అవ్వాలి, లేపోతే ఒక గుర్రం అన్నా కొనుక్కోవాలి అనుకున్నా" అన్నాడు వాడు.
వాడు చెప్పుకుంటూ పోయాడు, "అసలింకా చెప్పాలంటే గుర్రమెక్కి తిరిగే రాజునవుదాం అనుకున్నా, చిన్నప్పుడు చదువుకున్నాం కద - 'యమతాతరాజభానస' అంటే, యముడికి తాతయినా రాజుకి బానిసే !"
ఈసారి నేను తల బాదుకున్నాను.
నా బాధ చూడలేక వాడే, "ఎక్కడికైనా ట్రిప్ వేద్దాం రా, కేరళ ఐతే ఎలా ఉంటుంది ?" అన్నాడు.
"ఆహా, ఎన్నాళ్ళకి ఇంత మంచి మాట చెప్పవురా! కానీయ్, జనాల్ని పోగేద్దాం" అన్నాను.
చారిగాడికి ఫోన్ చేసాను.
"హైదరాబాదు నిండా ఇంతమంది అమ్మాయిలని పెట్టుకుని, కొబ్బరి చెట్లనీ, లుంగీలు కట్టుకునే వాళ్ళనీ చూస్తాం అంటారేంట్రా.. ఆ నాగబాబు గాడి సంగతి తెలిసిందే, నీ తెలివి తేటలెటుపోయాయ్ ?" అని ఫోన్ పెట్టేశాడు వాడు.
ఇలా కాదని ఇంకో ముగ్గురు నలుగురికి ఫోన్ చేసి అరచేతిలో ఐమాక్స్ సినిమా చూపించి ఒప్పించాను.
( సశేషం )

Comments
సూపర్..సౌరవ్ గంగూలీ బాటింగుకి బయలుదేరినట్టు..
సౌరవ్ గంగూలీ బాటింగుకి బయలుదేరినట్టు -- ఈ డైలాగ్ ఎంటండి బాబు.. నవ్వలేక్ చచ్చా..
ఏ స్కూల్ అండి మీ నాగ బాబు?
""హైదరాబాదు నిండా ఇంతమంది అమ్మాయిలని పెట్టుకుని, కొబ్బరి చెట్లనీ, లుంగీలు కట్టుకునే వాళ్ళనీ చూస్తాం అంటారేంట్రా.. ఆ నాగబాబు గాడి సంగతి తెలిసిందే, నీ తెలివి తేటలెటుపోయాయ్ ?" అని ఫోన్ పెట్టేశాడు వాడు."
మీ చారి సూపరండి బాబు.. :-) :-) :-)