"గతిలేని గుంపుకి మతిలేని నాయకుడు" అన్నారు. ఎవరన్నారో అడక్కండి. ఎవరినన్నారో అస్సలు అడక్కండి. జార్జి పుష్షో, కళ్ళగుంట్ల చండభీకర రావుగారో అని మాత్రం అపార్ధం చేసుకోకండి. ఎందుకంటే ఇక్కడి హీరో వేరే !
మళయాళ దేశానికి మనశ్శాంతి కోసం పారిపోదామనుకున్న మా అందరి బాగోగుల్ని నాగబాబుగాడు తలకెత్తుకున్నాడు. ఆ బరువుకి తల దిమ్మెక్కిందేమో తిన్నగా పోవల్సిన చోటుకి పోకుండా బెంగుళూరు మీంచి రూటు ప్లాన్ చేశాడు.
"మధ్యలో బెంగుళూరు ఎందుకురా, ఇదివరకే చూసాం కద" అని గొణిగాను.
"మీకందరికీ నా కళ్ళతో చూపిస్తాన"న్నాడు వాడు. నాకు సన్నగా వణుకు మొదలయ్యింది. వీడి నోట్లోంచి అలాంటి పవర్ ఫుల్ డయిలాగులు ఒచ్చినప్పుడల్లా ఏదో ఒక అనర్ధం జరిగి తీరుతుంది ! ఒక పక్క గుబులుగా ఉన్నా ఏదైతే అదయిందిలే అని మళయాళ దేవుడి మీద భారం వేసి ఊరుకున్నాను.
మాతోపాటూ విశాల్, విజయ్, బీరేష్(వాడి భాషలో) బెంగుళూరు బస్సెక్కారు. అందరూ మంచి వేడి మీద ఉన్నట్టున్నారు. బస్సు స్టార్టవుతూనే జేబులోంచి పేపర్లు బయిటకి తీసారు. చూడగానే గుర్తు పట్టేశాను. ఉద్యోగ పురాణం అసహన పర్వంలోని బాసాసుర తిట్ల దండకం కాపీలు అవి. డ్రైవరుకు ఆకలేసి దాబా దగ్గర ఆపేవరకూ చదవడం కంటిన్యూ చేసి, ఆపాక దిగి బత్తీలు వెలిగించి స్వస్తి చెప్పారు.
ఏమయినా తిందామని దాబా లోపలికెళ్ళాము.
అన్ని అయిటంసు అయిపోయాయి ఒక్క పూరీ మాత్రమే ఉందన్నాడు దాబా వాడు.
"అందులోకి ఆలూ కర్రీ ఉందా" ఆత్రంగా అడిగాడు బీరేష్ గాడు.
"చనా మసాలా ఉంది" అన్నాడు దాబావాడు.
"ఛీ, ఆలూ కర్రీ లేదు ఇదేం హోటలూ, అసలిలాంటి హోటళ్ళున్న ఇదేం స్టేటూ..మీ ఏపీ వేస్టు రా" అని వాపోయాడు బీరేష్ గాడు. అప్పుడు తెలియలేదు వాడికి ఎంత పెద్ద తప్పు చేశాడో !
వాడి మాటలు విన్న నాగబాబు గాడిలో అప్పటివరకూ ఎక్కడో మూల పడి మూలుగుతున్న రాష్ట్ర అభిమానీ, భాషాభిమానీ, సంస్కృతి అభిమానీ లేచి బట్టలు దులుపుకుని high-five చెప్పుకుని ఒకటేసారి బయిటకొచ్చారు.
"ఏంది రోయ్ తెలుగు దేశంలో ఉంటూ, తెలుగు హోటళ్ళలో తింటూ ఏపీ వేస్టు అంటున్నావ్.. ఎన్ని గుండెలు నీకూ" హూంకరించాడు. "సంవత్సరంలో ఒక్క రోజైనా ఒదిలిపెట్టకుండా తింటావ్ కదరా ఆలుగడ్డ, మీకంటే ఆ బెంగాలీ వాళ్ళే నయం..రోజూ చేపలే తిన్నా వాటిలో కనీసం రకాలుంటయి. ఏదీ ఒకసారి వంగవీటి వీర వెంకట వరప్రసాద్ వర్మ అను చూద్దాం..సగం అక్షరాల డిక్షనరీ వెధవ !" తిడుతూ పోయాడు నాగబాబుగాడు.
ఈ సందడికి చుట్టూ జనాలు మూగారు. నేను నాగబాబుగాడి ఆవేశాన్ని కంట్రోలు చేసే ప్రయత్నంలో ఉండగా ఒక గొంతు వినపడింది.
"ఏంటయ్యా గొడవ ఇక్కడ ?". అటు తిరిగి చూసాను. పసుపు కలర్ టీ షర్టు, ఎర్ర పాంటూ వేసుకుని టొపీ పెట్టుకున్న ఒకాయిన కనిపించాడు.
"అయిపోయిందిలెండి ఏమీ లేదు" అన్నాను.
రెండడుగులు ముందుకేసి నాగబాబు గాడి భుజం మీద చెయ్యేసి చిన్నగా ఒక నవ్వు నవ్వి "ఏంటోయ్ యాంగ్రీ యంగ్ మాన్, నువ్వేనా మీ గ్రూపుకి లీడరువి" అన్నాడు. నాగబాబుగాడి కోపం చప్పున చల్లారింది.సిగ్గుపడడం మొదలెట్టాడు.
"ఇందాకటినించి చూస్తున్ననయ్యా, మీ ఫ్రెండ్ ఎదో అన్నాడని నువ్వు ఇలా ఆవేశపడడం తప్పు. అది మన కల్చర్ కాదు. అయినా బంగాళాదుంప కూరే మన ఆంధ్రా వంటకం...చనా మసాలా కాదు."
కల్చర్, ఆంధ్రా లాంటి మాటలు వినగానే నాగబాబు గాడు "ఆహా, ఎంత కరెక్టుగా చెప్పారండీ. కోపంలో ఇవన్నీ అలొచించలేదు నేను.థ్యాంక్స్ సార్,నాకు ఙానోదయమయింది" అని బీరేష్ గాడికి సారీ చెప్పొచ్చాడు. అందరం ఈ కొత్త పరిణామాన్ని వింతగా చూస్తున్నాం.
"ఏంటీ, టూరుకెళుతున్నారా ?"
"అవునండీ, ఇంతకీ మీరెవరూ ?" అడిగాడు నాగబాబు గాడు.
"నా పేరు నీలమేఘం. తమిళ తంబిలు అభిమానం ఎక్కువ అయినప్పుడు 'నీలమగన్' అని పిలుస్తారు. లేడీస్ లవ్ ఎక్కువ అయినప్పుడు 'నీలా' అని పిలుస్తారు" అంటూ గాల్లోకి ఒక్క క్షణం చూసి చిన్న నవ్వు నవ్వి టోపీ తీసి లేని జుట్టు సరి చేసుకుని మళ్ళీ పెట్టుకున్నాడు.
"ఓరేయ్, మన తుగ్లక్ గాడు చాలక ఈ నమూనాగాడెవడో తగులుకున్నాడేంట్రా మన ప్రాణానికీ", నసిగాడు విజయ్ గాడు.
కష్టాలు కలకాలం ఉండవని చెప్పి వాణ్ణి ఓదార్చి.." చాలా థ్యాంక్స్ సార్, బస్సు కదిలేలా ఉంది.. మనం మళ్ళీ కలుద్దాం" అని చెప్పి నాగబాబు గాడి చెయ్యి పట్టుకుని లాగడం మొదలెట్టాను.
"ఓహో, కదులుతోందా అప్పుడే, పదండి బస్సులో కూర్చుని మాట్లాడుకుందాం" అన్నాడు నీలాగాడు.
"ఏంటీ, మీరు కూడా ఇదే బస్సులో బెంగుళూరు వెళ్తున్నారా ?" చిరాకుని ఆశ్చర్యంతో కప్పేసి అడిగాను.
"ఆప్పట్నించీ వెనకాల వైపునే కూర్చుని ఉన్నానయ్యా..మీరు చేసేవన్నీ చూస్తున్నాను. మంచి సరదాగా ఉంది మీ గ్రూపు. అయితే నేను వేళ్ళేది మాత్రం కేరళ దాకా.. బెంగుళూరులో చిన్న పని ఉంటే చూసుకుని వెళ్దామని" అన్నాడు.
అంతే - గత ఆరు నెలలుగా నేను చేసిన పాపాలన్ని గుర్తు తెచ్చుకోడం మొదలెట్టాను. ఈ ఆర్నెల్లలో కనీసం మూడు చీమల్నీ, అర డజను దోమల్నీ, ఒక బొద్దింకనీ చంపేసి ఉంటాను. గుడికెళ్ళి ఒక్కసారి కుడా దేవుడికి మొహం చూపించలేదు. మా బాసుతో చెప్పినవి మొదలుకుని కనీసం ఒక వెయ్యి అబద్దాలు ఆడి ఉంటాను. మరో వెయ్యి బూతులు మాట్లాడి ఉంటాను. ఏక్కడికి పోతాయ్ అవన్నీ ?
భారంగా నిట్టూర్చాను.
"గురువుగారూ, ముందే చెప్పలేదే ! మీరు ఒచ్చి మాతో కూర్చోవల్సిందే, అది మా అదృష్టం" అన్నాడు నాగబాబుగాడు.
ఆ మాట వినగానే బ్యాక్ గ్రౌండులో విజయ్ గాడు ఎక్కడినించో ఒక సూట్ కేసు తిసుకొచ్చి నాగబాబు గాడి నెత్తిన వెయ్యబోతుంటే బీరేష్ గాడు ఆపుతున్నాడు.
బస్సు స్టార్టయ్యింది.
"గురూగారూ, ఇంతకీ మీరేం చేస్తుంటారో చెప్పలేదు" అన్నాడు నాగబాబుగాడు.
"నేను చైన్ మర్కెటింగ్ చేస్తుంటానయ్యా, ఖాళీ టైములో తెలుగు సినిమా కధలూ, టైటిల్సూ ఆలోచిస్తుంటాను."
ఈ రోజు మా అందరికీ మూడిందీ, నాగబాబుగాడి పంట పండిందీ అని నాకు అర్ధం అయ్యింది.
"చైన్ మార్కెటింగా..అదంటే నాకు మంచి ఇంటెరెస్టు సార్. నేనూ దిగుదాం అనుకున్నా. ఇంతకీ ఏం మార్కెట్ చేస్తుంటారు సార్..లాప్టాపులూ, కెమేరాలూ, గోల్డు కాయిన్సూ..? బాగా గిట్టుబాటు అవుతుందా ? ఒక్కొకడూ ఎంతమందిని చేర్పించాలి ? నా దగ్గరొక అద్భుతమయిన అయిడియా ఉంది సార్, నేను చేర్పించాల్సిన ముగ్గురి బదులూ నేనే మూడు పేర్లు పెట్టుకుని మళ్ళీ చేరితే బోల్డు డబ్బులు కదండీ ?"
కరెంటు షాక్ కొట్టి మాట పడిపోయిన వాళ్ళలా జరిగేది చూస్తున్నాం అయోమయంగా.
నాగబాబు మాటలు విన్న నీలాగాడు మేధావిలా చిన్నగా తల ఊపాడు.
"నువ్వు చెప్పినవన్నీ మన కల్చర్ కాదయ్యా...ఒకడు ముగ్గురిని చేర్పించడాలూ ఇవన్నీ పనికిరాని మాటలు. మన కల్చర్ కాని వాటిని నేనెందుకు చేస్తా" అంటూ నాలిక బయిటపెట్టి తల అడ్డంగా ఊపాడు నీలాగాడు.
"మా ఇంటి పక్కాయిన సైకిల్ చైన్లు తయరు చేస్తాడు, నేను వాటిని మార్కెట్ చేస్తాను" .
ఇది వినగానే నాగబాబు గాడికి ఎక్కడో తేడా ఉందనిపించినట్టుంది. వాడు ఆలొచించేలోపల బీరేష్ గాడు అప్పటిదాకా ఆపుకుంటున్న నవ్వుని బయిటకి కక్కేసాడు. నాగబాబుగాడు వాడి వైపు తిరిగి ఏదో తిట్టబోయేలోపు బస్సులో డీవీడీ ప్లే చెయ్యడం మొదలుపెట్టారు. 'ఒకే ఒక్కడు ' సినిమా ఒస్తోంది.
నీలాగాడు వెంటనే అందుకున్నాడు. "మన తెలుగు సినిమాల్లో బొత్తిగా క్రియేటివిటీ లేకుండా పోయిందయ్యా. టైటిల్స్ పెట్టడం దగ్గరినించి ఎక్కడా ఆసక్తి కలిగించేటట్టు ఉండట్లేదు. ఈ సినిమానే తీస్కో, ఆ టైటిల్ చూడగానే హీరోయిజమంతా తెలిసిపోతోంది. ఇంక జనాలకి ఇంటెరెస్ట్ ఏముంటుంది ?" అన్నాడు.
నాగబాబుగాడు అప్పటిదాకా ఆలోచిస్తున్నది పక్కనబెట్టేసి "అవును సార్ నిజమే" అన్నాడు బాధగా.
"ఏంటో చెప్పడు - ఎలా ఉంది టైటిలు ? ", అడిగాడు నీలాగాడు.
"ఆహా, అద్భుతం సార్,పిచ్చెక్కిచ్చారు ! ప్రపంచంలో ఉన్న సస్పెన్సంతా ఈ టైటిల్లోనే ఉన్నట్టుంది. ఎంతయినా మీకు మీరే సాటి గురూగారూ. టైటిలు వినగానే అసలూ కధేంటో తెలుసుకోవాలని మాంఛి ఇదిగా ఉంది" మళ్ళీ కరెక్టుగా రాంగ్ ట్రాక్ లోకి ఒచ్చేసాడు నాగబాబుగాడు.
"కధ అంతా ఇంకా రెడీగా లేదు గానీ, కాన్సెఫ్టు చెప్తా విను" మొదలెట్టాడు నీలాగాడు.
"సినిమాలో హీరో ఒక ఆర్టిస్టు".
"ఆహా, కాన్వాసూ, రంగులూ, ప్రకృతీ... మంచి ఆర్టు సినిమా అనమాట !"
"చూసావా, అక్కడే పెయింటులో కాలేసావ్. మన హీరో అందరు హీరోల్లా కాదు. కాన్వాసులూ గట్రా ఏమీ ఉండవు. నల్ల బోర్డు మీద చాక్పీసుతో బొమ్మలేస్తాడు. నువ్వన్నట్టు ఇదేదో ఆర్టు సినిమా కాదు. ఇది పక్కా యాక్షన్ సినిమా".
"సూపర్ సార్, కధ ఊహించని మలుపులు తిరిగిపోతోంది అప్పుడే!"
"ఆర్టిస్టు కావడంతో మన హీరో ఎప్పుడు నల్ల బోర్డు, చాక్పీసులు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు.ఒక అర డజను మంది విలన్లు ఉంటారు. హీరోకి కోపం ఒచ్చినప్పుడల్లా ఒక్కో విలన్ దగ్గరకీ వెళ్ళి బోర్డు మీద ఒక బొమ్మ గీసి చూపిస్తాడు. విలన్ కి అర్ధం కాక ఏంటిది అని అడగ్గానే వాణ్ణి చంపేస్తుంటాడు. ఆఖరి విలన్ దగ్గరకి ఒచ్చెటప్పటికి, హీరో ఆ బొమ్మ వెయ్యగానే గుండె ఆగి చస్తాడు వాడంతట వాడే. ఆలా చివరి దాకా ఎవడికీ వాడు ఎప్పుడూ గీసే ఆ బొమ్మ ఏంటో చెప్పడు. ఎలా ఉంది కాన్సెప్టు ?" అన్నాడు నీలాగాడు.
అది విన్న విజయ్ గాడు సీట్లోంచి కింద పడి గిలా గిలా కొట్టుకోవడం మొదలెట్టాడు. బస్సులో మిగితా జనాలు చూసి వాడి చేతిలో తాళం చెవులు పెట్టి మొహాన నీళ్ళు జల్లి లేపి కూచోబెట్టారు. వాడు ఇంకా షాక్ లో ఉండి చుట్టూ ప్రపంచాన్ని పట్టించుకోకుండా కూచున్నాడు.
ఈ తతంగమంతా చూడని నాగబాబుగాడు "టైటిల్ జస్టిఫికేషన్ అదిరింది సార్, హీరో ఎవరయితే బావుంటుంది ?" అన్నాడు.
"ఇప్పటి దాకా తెలుగు తెర మీద అంత హీరోయిజం పండించగల మగాడు ఒక్కడే ఉన్నాడయ్యా. ఎప్పుడూ అయిన మొహమే ఐతే బావుండదుగానీ ఏదయినా ఫ్రెష్ ఫేసు కోసం వెతుకుదాం." అంటూ పక్కకి చూసి ఉన్నట్టుండి నాగబాబుకేసి చూసాడు నీలాగాడు.
"ఒకసారి అలా మీ వాళ్ళ మధ్యలో కూర్చుని కోపంగా ఇటు వైపు చూడు"
చెప్పింది చెప్పినట్టు చేసాడు నాగబాబుగాడు.
"ఆహా, బ్రెడ్డు ముక్కల మధ్య ఆవకాయ బద్దలా ఉన్నావు. ఈ సినిమా తీయడమంటూ జరిగితే నువ్వే హీరోవి !"
"ఫొండి సార్ మీరూ మరీ" అంటునే వాడు ఉబ్బి తబ్బిబ్బు ఐపోడం మొదలెట్టాడు. అది చూసి ఆ వరసలో జనాలంతా సీట్లు ఖాళీ చేసారు.
అప్పటి దాకా లవ్ ఫెయిల్యూర్ బాధలో ఉండి ఏమీ మాట్లాడని విశాల్ గాడు కత్తి ఎక్కడయినా దొరుకుతుందేమో వెతకడానికి బస్సు అంతా తిరగడం మొదలెట్టాడు.
ఆత్మహత్యో, మర్డరో జరక్కుండా ఈ రాత్రి గడిచిపోయి మేము బెంగుళూరులో పడితే చాలని దేవుడికి మనసులోనే దణ్ణం పెట్టుకున్నాను.
(ఇంకా ఉంది)

Comments