ఆ రోజు అప్రయత్నంగా వంట డ్యూటీ నాగబాబుకి ఇచ్చేసి డిక్షనరీ పక్కన పెట్టుకుని హిందూ పేపర్ చదువుకుంటున్నాను.
"ఒరేయ్, పప్పులో ఉప్పెంత వెయ్యాలి ?" అడిగాడు నాగబాబు.
"ఒక చారెడు వెయ్ " తల తిప్పకుండా సమధానం చెప్పా.
"మరి చారేమో గిన్నెడు ఉంది కదరా ?"
ఈ సారి తలెత్తి చూడకుండా ఉండలేకపోయాను.
వంటింటి గుమ్మంలో బనీనుతో కుడి చేతిలో గరిట పట్టుకుని ఎడం చెయ్యి నడుం మీద వేసుకుని చిరునవ్వులు చిందిస్తున్నాడు వాడు.
"ఒరేయ్ బడుద్ధాయ్, నీకు తెలుగొచ్చా అసలు ?" అరిచాను.
" ఓహో అర్ధం అయింది లే, అరుస్తావెందుకు ? చారిగాడు పెరుగు తెస్తానని బైటకి వెళ్ళాడు ఇప్పుడే. వాడొచ్చే దాకా ఆగాలంటే కష్టం" అన్నాడు నాగబాబు.
ఈ రోజు హిందూ పేపరు అనవసరంగా కొన్నట్టున్నాను.
"ఒరేయ్ సన్నాసీ, చారెడు అంటే ఇంత" అన్నాను అరచేతిలో నాలుగువేళ్ళ మీద బొటనవేలు మడిచి చూపిస్తూ,
"అయినా నీకు తెలుగూ రాదు, వంటా రాదు; ఇలా ఐతే ఎదో ఒక టీవీ ఛానల్లో వంటల ప్రోగ్రాంలో యాంకర్ కింద సెటిల్ అవ్వాల్సొస్తుంది జాగ్రత్త !" శపించా.
వాడు పగలబడి నవ్వి లోపలికెళిపోయాడు, పొగిడాననుకున్నాడో ఏమో!
అప్పుడప్పుడు విసిగిస్తాడు గానీ, వాడి మంచితనం లీటర్లతోనో, మీటర్లతోనో, మాటల్తోనో కొలవలేము. చిన్నప్పటినించీ వాడంటే నాకు అభిమానం, నేనంటే వాడికి నమ్మకం. ఆలోచిస్తూ పేపరు పక్కన పడేసి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను.
--------------------------------------------------------
"ఒరేయ్ నాన్నా, మా బుజ్జి కదూ...ఆం తినమ్మా" బ్రతిమాలుతోంది మా అమ్మ.
"అమ్మా, నాకు ఆం ఒద్దే...బోయినం కావాలి"
"బోయినం అంటే ఇదే........బంగారు కొండ కదూ, తొందరగా తినేయలి"
"అహా...ఇది బోయినం కాదు..నేను తినను"
"అలా గొడవ చెయ్యకూడదు, చూడు నాగబాబు అప్పుడే ఆం తినేసి ఒచ్చాడు" అంది మా అమ్మ, అప్పుడే ఒచ్చిన వాణ్ణి చూపిస్తూ.
"నేను బోయినం ఐతేనే తింటాను" అని అరిచాను గట్టిగా.
"ఈ బోయినం ఏవిట్రా, ఎక్కడ తిన్నావు ?" అడిగింది మా అమ్మ .
"మరేమో, ఆకేసి,పప్పేసి,నెయ్యేసి,కూరేసి,అన్నమేసి... మొన్న పెళ్ళికి వెళ్తే పెట్టారే, అది" అన్నాను.
అప్పుడు నా బాధ అర్ధం అయిన మా అమ్మ, ఒక అరిటాకు పట్టుకొచ్చి, కంచంలోవన్నీ అందులో వేసి పెట్టింది.
తృప్తిగా కళ్ళు మూసుకుని తిన్నాను.
ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న నాగబాబుగాడు ఆ రోజు నుండి నా ఫ్యాన్ అయిపోయాడు.
ఇందాక, చిన్నప్పటినించీ వాడంటే నాకు అభిమానం, నేనంటే వాడికి నమ్మకం అని చెప్పాను కదా....తప్పు.
అంటే...వాడంటే నాకు ద్వేషం, నేనంటే వాడికి అపనమ్మకం అని కాదు;
వాడంటే నాకు నామ్మకం, నేనంటే వాడికి అభిమానం !

Comments
అన్నట్టు ఇప్పుడూ ప్రతిరోజూ బోయనమేనా ?
@వినయ్ - ధన్యవాదాలు.
మేం కూడా కరకరలు కోసం వెయిట్ చేస్తున్నాం all the best
ఏంటీ, రోజూ బోయినాల వాయినమా...ఇదేదో బంపర్ ఆఫర్ లా ఉందే !
అయినా మీరు next levelలో ఉన్నారు లెండి. నేను మటుకు ఏ దేశమేగినా ఎందు కాలిడినా టామాటా పప్పు, బంగాళదుంప వేపుడు మీద బతికేస్తున్నాను. అవి ఎక్కడయినా దొరుకుతాయి కద మరి !
నెనర్లు.
అయినా గోదావరి వాళ్ళకి వంట రాకపోడమేంటి..
నాకు చెప్పకండి..మా అమ్మ వాళ్ళది గోదావరే !
ఇస్టొరి లొ చమత్/కారం స్వీట్/గుంది